సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హరోం హర. ది రివోల్ట్ ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ దర్శకత్వం. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాటల ప్రమోషన్‌ను వేగవంతం చేశారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ కనులెందుకో కలిసే నులే విడుదలైంది. చైతన్ భరద్వాజ్ ఈ పాటను స్వరపరచడంతో పాటు నిఖితా శ్రీవల్లితో కలిసి ఆలపిం చారు. మెలోడీ ప్రధానంగా సాగిన ఈ పాటలో సుధీర్‌బాబు, మాళవిక శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశానని దర్శకుడు తెలిపారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాత: సుమంత్ జి నాయుడు, రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక.