ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సారంగపాణి జాతకం. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడారు. ప్రియదర్శి వైవిధ్యమైన నటుడని మా అందరి నమ్మకం. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ప్రేక్షకులు అదేమాటంటున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌గారితో ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్‌కొట్టడం ఆనందంగా ఉంది అన్నారు.

సకుటుంబ సపరివార సమేతంగా థియేటర్లలో చూసి ఆనందించాల్సిన చిత్రమిదని ఆయన అన్నారు. వైజాగ్‌లో వేసిన ప్రీమియర్‌షోలకే పాజిటివ్ వైబ్స్ వచ్చాయని, బుక్‌మై షోలో సినిమా ట్రెండ్ అవుతున్నదని, అన్ని రివ్యూస్ అద్భుతంగా వచ్చాయని హీరో ప్రియదర్శి ఆనందం వ్యక్తం చేశారు. సారంగపాణి ప్రభంజనం ఇప్పుడే మొదలైందని, మౌత్‌టాక్‌తో మరింత ముందుకు వెళ్తుందనే నమ్మకం ఉందని, ఈ విజయంతో టీమ్ మొత్తం హ్యాపీగా ఉన్నామని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సక్సెస్‌మీట్‌లో రూపా కొడవయూర్, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
