ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అతడు ఆమె ప్రియుడు. సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి దర్శకుడిగానూ ఈ సినిమాతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాం. ఆయన ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించారు. యండమూరితో మరిన్ని సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, దశరథ్, రచయిత విజయేంద్రప్రసాద్, నిర్మాత సి.కల్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి వడ్డీ, కెమెరామేన్, ఎడిటర్ మీర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కూర్పు, కెమెరా: మీర్. నిర్మాణ సారధ్యం : అమర్. రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేకుకుల ముందుకు రానుంది.














