Skip to main content

Namaste NRI

అతడు ఆమె ప్రియుడు ప్రి రిలీజ్ వేడుక

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అతడు ఆమె ప్రియుడు. సునీల్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ కౌశల్‌, సీనియర్‌ నటుడు బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి దర్శకుడిగానూ ఈ సినిమాతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాం. ఆయన ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించారు. యండమూరితో మరిన్ని సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.  ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా, దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, దశరథ్‌, రచయిత విజయేంద్రప్రసాద్‌, నిర్మాత సి.కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  హీరో భూషణ్‌, హీరోయిన్‌ మహేశ్వరి వడ్డీ, కెమెరామేన్‌, ఎడిటర్‌ మీర్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కూర్పు, కెమెరా: మీర్‌. నిర్మాణ సారధ్యం : అమర్‌. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న  ప్రేకుకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News