Skip to main content

Namaste NRI

తాను అధికారంలోకి …ఆ దేశాలకు ఒక్క పైసా కూడా ఇవ్వను

తాను అధికారంలోకి వస్తే అమెరికాను వ్యతిరేకించే దేశాలకు ఒక్క పైసా కూడా ఇవ్వనని భారత సంతతి రిపబిక్లన్ నేత నిక్కీ హేలీ స్పష్టం చేశారు.  రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న నిక్కీ హేలీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఓ దేశంగా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి దుష్టదేశాలకు నిధులు ఇవ్వడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. అమెరికన్లు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ విధంగా వృథా చేయబోనని హేలీ స్పష్టం చేశారు. అమెరికా గతేడాది పలు దేశాలకు నిధుల రూపంలో 46 బిలియన్ డాలర్లు అందించిందని హేలీ పేర్కొన్నారు. ఇదంతా అమెరికా ప్రజలు చెల్లించిన పన్నుల మొత్తమేనని, కాగా ఈ డబ్బంతా ఎటువెళుతోందని అడిగే హక్కు పన్నులు కట్టేవారికి ఉంటుందని అన్నారు. తాము పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును అమెరికాను ద్వేషించే దేశాలకు అందజేస్తున్నారని తెలిస్తే అమెరికా ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతారని ఆమె వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News