విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్న తమిళ రోమియో మూవీ తెలుగులో లవ్ గురు గా విడుదల కాబోతోంది. మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చెల్లెమ్మవే అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించగా, భరత్ ధనశేఖర్ స్వరాలు సమకూర్చారు. ఆదిత్య ఆర్కే ఆలపించారు. చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే.. నా చెల్లివే.. నువు నా చెల్లివే.. నేనున్నదే నీ కోసమే.. విధి రాసెనే, ఒక రాతనే… ఆ ఆటలో ఎద కృంగెనే అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాప కాలతో ఎమోషనల్‌గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హార్ట్ టచింగ్ సెంటిమెంట్ కూడా ఉంటుందనే విషయం ఈ పాటతో వెల్లడవుతోంది. వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.