ఆధ్యాత్మికత కోసం విశేష కృషి చేస్తున్నందుకు శ్రీ కమలేష్ డి. పటేల్‌కు పద్మభూషణ్‌ను ప్రదానం చేశారు. నేడు రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ కమలేష్ డి. పటేల్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. హార్ట్‌ఫుల్‌నెస్ మూవ్‌మెంట్ స్థాపకుడు మరియు ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాలలో ఒకటైన కన్హ శాంతి వనాన్ని అభివృద్ధి చేసి విశేష సేవలందిస్తున్న ధాజీకు పద్మభూషణ్ సత్కారం లభించడం పట్ల తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, 23వ మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి హర్షం వ్యక్తం చేశారు. జులై 7 నుండి 9 వరకు ఫిలడెల్ఫియా లో జరుగునున్న 23వ తానా మహాసభలకు విశిష్ట అతిధిగా ధాజీ హాజరవుతున్నారని తెలిపారు.

