Namaste NRI

డొనాల్డ్ ట్రంప్‌కు సహాయం చేస్తాం : క‌మ‌లా హారిస్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌  ఘన విజయం సాధించారు. ఈ నేప‌థ్యంలో ట్రంప్‌  ప్ర‌భుత్వ ఏర్పాటుకు, అధికార మార్పిడికి స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు క‌మ‌లా హారిస్ తెలిపారు. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా పోరాడి ఓడిన క‌మ‌లా హారిస్ హోవ‌ర్డ్ యూన‌వ‌ర్సిటీలో ఆమె త‌న మ‌ద్ద‌తుదారుల‌తో భావోద్వేగంగా మాట్లాడారు. అమెరికా ఆశాజ్యోతి దివ్యంగా వెలుగుతుంద‌ని  తెలిపారు. అధికార మార్పిడి శాంతియుతంగా జ‌రిగేందుకు ట్రంప్‌న‌కు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఫ‌లితాల‌ను ఆమోదించాల‌ని ఆమె అభిమానుల‌ను కోరారు. దేశ ఆద‌ర్శాల‌ను ర‌క్షించేందుకు పోరాడాల‌న్నారు. త‌న మ‌న‌సు సంతోషంతో నిండి ఉన్న‌ద‌ని, మీరు నాపై చూపిన న‌మ్మ‌కానికి కృత‌జ్ఞ‌త‌తో ఉన్న‌ట్లు ఆమె తెలిపారు. విజ‌యం సాధించిన ట్రంప్‌ తో మాట్లాడాన‌ని, ఆయ‌న‌కు కంగ్రాట్స్ చెప్పిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ట్రంప్‌కు, ఆయ‌న టీమ్‌కు హెల్ప్ చేస్తాన‌ని చెప్పాన‌ని, శాంతియుతంగా అధికారాన్ని బ‌దలాయిస్తామ‌న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events