నవీన్ చంద్ర హీరోగా రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లెవెన్. లోకేశ్ అజ్ల్స్ దర్శకుడు. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను రూపొందించారు. తాజాగా ఈ మూవీలోని ఇక్కడ రా అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ గీతాన్ని డి.ఇమ్మాన్ స్వరపరచగా, ఆండ్రియా జెరెమియా పాడటంతోపాటు పర్ ఫార్మ్ చేశారు. ఈ పాటలో ఆండ్రియా మూమెంట్స్ ఆకట్టుకుంటాయని, సినిమాకు ఈ పాట ఓ హైలైట్ గా నిలుస్తుంది మేకర్స్ చెబుతున్నారు. ఈ సమ్మర్ లో విడుదల కానుంది.
