Skip to main content

Namaste NRI

హీరో అశోక్ గల్లా కొత్త చిత్రం ప్రారంభం

అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో  ప్రారంభమైంది. అర్జున్ జంధ్యాల దర్శకుడు. జాంబీరెడ్డి ఫేమ్ ప్రశాంత్వర్మ కథనందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో వెంకటేష్ క్లాప్నివ్వగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విఛాన్ చేశారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు  మాట్లాడుతూ విభిన్నమైన కథ ఇది. అశోక్ గల్లా పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది. సాయిమాధవ్ బుర్రా మాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి అని తెలిపారు.  ప్రశాంత్వర్మ మాట్లాడుతూ దాదాపు నాలుగేళ్లు ఈ కథపై పనిచేశా. చక్కటి వినోదంతో మెప్పిస్తుంది. అశోక్ గల్లా కంప్లీట్ మేకోవర్తో కనిపిస్తారు  అని పేర్కొన్నారు.  అశోక్ గల్లా మాట్లాడుతూ ఈ సినిమాలో రఫ్ లుక్లో కనిపిస్తా. యాక్షన్ హీరోగా పేరు తీసుకొస్తుంది. ప్రశాంత్వర్మ కథనందించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

యూనిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అశోక్ గల్లా పూర్తిగా మేకోవర్ మార్చుకున్నట్టు తాజా లుక్తో తెలుస్తోంది. ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతికి నిపుణులు ఎవరెవరు పనిచేయబోతున్నారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో ఆది శేషగిరిరావు, బీవీఎస్ రవి, గల్లా జయదేవ్తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ: ప్రశాంత్వర్మ, సమర్పణ: నల్లపనేని యామిని, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events