
సిద్ధార్థ్ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్ 3 BHK. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రధారులు. శ్రీగణేశ్ దర్శకుడు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్‌విశ్వ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. జూలై 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని బ్యూటిఫుల్ ఫ్యామిలీగా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే పూర్తి కమర్షియల్ సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. మీఠా రఘునాథ్, చైత్ర తదితరులు తారాగణం.
