హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఎకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ హిడింబ ట్రైలర్ అదిరిపోయింది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అశ్విన్ సినిమా ట్రైలర్ లాంచ్ కి రావడం ఆనందంగా వుంది. క్రికెట్ తో మా పరిచయం ఏర్పడింది. ఈ సినిమా పెద్ద విజయం కావాలి అని కోరారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ మీ అందరికీ ట్రైలర్ నచ్చడం ఆనందంగా వుంది. నా స్నేహితుడు తేజు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. విరూపాక్ష తో వందకోట్ల క్లబ్ లో తేజు చేరడం నాకు గర్వంగా వుంది. పవన్ కళ్యాణ్ గారు మా ఇద్దరికీ ఫేవరేట్. ఇప్పుడు ఆయనతో బ్రో సినిమా చేస్తున్నాడు. ఇది ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. హిడింబ నా కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా చేశారు. దర్శకుడు అనిల్ సినిమా అద్భుతంగా తీశారు. సినిమా అందరినీ ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది. టీం అందరికీ థాంక్స్. అనిల్ సుంకర గారు ఈ సినిమాని ప్రజంట్ చేయడం చాలా ఆనందంగా, పాజిటివ్ గా వుంది అన్నారు.

నందిత శ్వేత మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్ చేసిన తేజ్ గారికి కృతజ్ఞతలు. తేజ్ గారు నాకు స్ఫూర్తి. హిడింబ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. సినిమా ఇంకా అద్భుతంగా వుంటుంది. ఇందులో చాలా కీలకమైన పాత్ర చేశాను. దర్శక నిర్మాతలకు అశ్విన్ కి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు మేకర్స్. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
