Namaste NRI

హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్

 నాని కథానాయకుడిగా నటించిన చిత్రం హిట్‌-ది థర్డ్‌ కేస్‌. శ్రీనిధి శెట్టి కథానాయిక.  శైలేష్‌ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మే 1న విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రేమ వెల్లువ అనే తొలి గీతాన్ని ఈ నెల 24న రిలీజ్‌ చేయబోతున్నారు.  మెలోడీ ప్రధానంగా సాగే యుగళగీతమిదని, మిక్కీ జే మేయర్‌ కంపోజ్‌ చేసిన ట్యూన్‌ అందరిని అలరిస్తుందని, ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్‌ చేశాయని దర్శకుడు పేర్కొన్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events