Namaste NRI

శ్రీవిష్ణు సామజవరగమన నుంచి హోలా రే హోలా

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం  సామజవరగమన. రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది.  రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు.  ఈ చిత్రంలో ఈ చిత్రం నుంచి హోలా రే హోలా అనే పాటని విడుదల చేశారు మేకర్స్.

గోపీ సుందర్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఆకట్టుకునే మెలోడీలా కంపోజ్ చేశారు. జెవి సుధాన్షు, సోనీ కొమందూరి పాడిన ఈ పాటకు శ్రీమణి అందించిన లిరిక్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వున్నాయి. ఈ పాటలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. పాటలో విజువల్స్ గ్రాండ్‌గా వున్నాయి. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events