అమెరికాలోని హ్యూస్టన్ తెలుగు భాష, సాంస్కృతిక పరిరక్షణ కోసం నెలకొల్పిన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి త్వరలో స్వర్ణోత్సవాలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో సమితి నూతన కార్యవర్గం, ట్రస్టీలను ఎన్నుకున్నారు.

నూతన ప్రెసిడెంట్‌గా యాదగిరిరెడ్డి కుడుముల ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా రామకృష్ణగొడవర్తి, కోశాధికారిగా జయశ్రీ బొందు, కల్చరల్ సెక్రటరీగా స్నేహలత చిర్ర, వెబ్ అండ్ కమ్యూనికేషన్స్‌కు వాణి దూడల, లిటరసీ సెక్రటరీగా మైథిలి చాగంటి, స్పోర్ట్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్‌కు శ్రీనగేశ్ సూరెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా దామోదర్ రెడ్డి జమిలి, ఉషా రంగరాజ్, ఆశాజ్యోతి దేవకీ వ్యవహరించనున్నారు.

1976లో చిన్న విత్తనంలా మొలకెత్తిన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి నేడు వటవక్షంలా విస్తరించి వేలాది కుటుంబాలకు నీడనిచ్చే స్థాయికి చేరుకుంది. ఐక్యత, సేవాభావంతో ఐదు దశాబ్దాలుగా పనిచేస్తూ, విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు ప్రసరింపజేస్తోంది. స్థాపకులు, గత కార్యవర్గాలు, ట్రస్టీలు, వాలంటీర్లు, సభ్యుల సమష్టి కషితో సంస్థ మంచిపేరు సంపాదించుకుందని నిర్వాహకులు తెలిపారు.














