హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం వార్-2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలోని ఓ పాటలో హృతిక్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఇద్దరూ మంచి డ్యాన్సర్స్ కావడంతో ఈ పాట ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో జనాబ్ ఈ అలీ (తెలుగులో సలామే అనాలి) అంటూ సాగే ఆ పాట తాలూకు గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. త్వరలో పూర్తి పాటను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అమితాబ్ భట్టాచార్య స్వరాల్ని అందించిన ఈ పాటను తెలుగులో కృష్ణకాంత్ రచించారు. నకాష్ అజీజ్, యాజిన్ నిజార్ ఆలపించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
















