అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బ విద్యార్థులపై గట్టిగా పడటంతో అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయింది. 2025లో ఆగస్టులో అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 44 శాతం తగ్గింది. భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ (స్టెమ్) కోర్సులు ఎక్కువగా చదువుతుం టారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అంతా తలకిందులైంది. దీంతో ఈ ఏడాది పరిస్థితి వేరేగా ఉంది. ఏకంగా 44 శాతం మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇది మిగిలిన అన్ని దేశాల కన్నా భారీ తగ్గుదలగా పేర్కొంటున్నారు. అయితే మొత్తం మీద అన్ని దేశాల విద్యార్థుల సంఖ్య 19 శాతం తగ్గుదల నమోదు కాగా, భారతీయ విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది.

మన దేశం నుంచి అమెరికాకు వెళ్లడం తగ్గిందేమో కానీ, విద్యార్థులు దానికి ప్రత్యామ్నాయ దేశాలను ఎంపిక చేసుకుని వెళ్తున్నారు. వారు ఇప్పుడు కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, కొన్ని అరబ్ దేశాలను అమెరికాకు ప్రత్యామ్నాయాలు గా ఎంచుకుంటున్నారు. భారత్‌తో పాటు మిగిలిన దేశాల విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో వాటి దుష్పరిణామాలను అమెరికా యూనివర్సిటీలు ఇప్పటికే స్పష్టంగా ఎదుర్కొంటున్నాయి.















