Namaste NRI

భవిష్యత్తులో ఏఐతో మానవత్వానికే ముప్పు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పెను సంచలనాన్ని సృష్టిస్తున్నది. ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. భవిష్యత్తులో ఈ ఏఐతో మానవత్వానికే ముప్పు వాటిల్లనున్నదని ప్రపంచంలోనే టాప్‌ కంపెనీల సీఈవోలు అభిప్రాయపడ్డారు. ఏఐ దుష్ప్రభావాలపై యూఎస్‌కు చెందిన యేల్‌ వర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్‌మార్ట్‌, జూమ్‌, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్‌సహా ప్రపంచంలోనే టాప్‌ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 42శాతం మంది రాబోయే 5-10 ఏండ్లలో ఏఐతో మానవత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 34 శాతం మంది మరో పదేండ్లలో కృత్రిమ మేధతో మానవాళికి ముప్పు పొంచి ఉందని తెలుపగా, 8 శాతం మంది ఐదేండ్లలోనే ఏఐ దుష్ప్రభావాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress