రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ అస్ఫాన్(30) మరణించాడు. ఉద్యోగం పేరుతో ఏజెంట్ల చేతిలో మోసానికి గురైన అతను రష్యా సైన్యంలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్టు తెలుస్తున్నది. మహ్మద్ అస్ఫాన్ యుద్ధంలో చనిపోయిన విషయాన్ని అధికారులు బుధవారం ధ్రువీకరించా రు. రష్యా నుంచి తన కుమారుడిని తిరిగి రప్పించేందుకు సాయం చేయాలని అస్ఫాన్ కుటుంబసభ్యులు ఇటీవల ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కోరారు. దీంతో ఆయన మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించగా, అస్ఫాన్ మరణించినట్టు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించారు.