Namaste NRI

ఈ సినిమా అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది

యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం పొట్టేల్‌. సాహిత్‌ మోత్కూరి దర్శకుడు. సురేష్‌ కుమార్‌ సడిగే నిర్మాత. తాజా చిత్రం పొట్టేల్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు సాహిత్‌ మోత్కూరి మాట్లాడుతూ విడుదలైన అన్ని కేంద్రాల్లో సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ మధ్యకాలంలో ఇంత పాజిటివ్‌ బజ్‌ ఏ సినిమాకు రాలేదు. థియేటర్లో ప్రేక్షకుల నుంచి స్టాండింగ్‌ ఒవేషన్‌ లభిస్తున్నది. చదువు అవశ్యకత గురించి గొప్పగా చెప్పిన చిత్రమిదని అందరూ ప్రశంసిస్తున్నారు అన్నారు.

 నిర్మాత సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ థియేటర్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ లభిస్తున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు కంటతడి పెడుతున్నారు. ఒక మంచి ప్రయత్నంతో సందేశాన్ని మేళవించి చేసిన ఈ సినిమా అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని, బుజ్జమ్మ అనే పేరుతో పిలుస్తున్నారని కథానాయిక అనన్య నాగళ్ల చెప్పింది. కెరీర్‌ ఆరంభంలోనే ఇంటెన్స్‌ క్యారెక్టర్‌ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని హీరో యువచంద్రకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events