
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల్లో తానేమీ జోక్యం చేసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ జనరల్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్‌కు గొప్ప ప్రధాని ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడలు చేసిన విషయం తెలిసిందే. కాబూల్, కాందహార్‌లో ఉన్న ఆఫ్ఘన్ తాలిబన్ మిలిటరీ కేంద్రాలను పాక్ ధ్వంసం చేసింది. ఆ దాడుల్లో సుమారు 133 మంది తాలిబన్ మిలిటెంట్లు మృతిచెందారు. అయితే ఆ దాడులు గురించి ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆయన బదులిస్తూ పాకిస్థాన్ మిలిటరీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను కొనియాడారు. కావాలంటే తాను జోక్యం చేసుకోగలనని, కానీ పాక్ వద్ద గొప్ప ప్రధాని , గొప్ప జనరల్ ఉన్నారని, ఆ ఇద్దరినీ తాను గౌరవిస్తానని అన్నారు. పాకిస్థాన్ అద్భుతంగా చేస్తున్నట్లు భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.















