Namaste NRI

దానికర్థమేంటో తెలిసేదికాదు : గోల్డీ నిసీ  

గోల్డీ నిసీ  కథానాయికగా పరిచయమవుతున్న సినిమా ఛాంగురే బంగారురాజా. కార్తీక్‌ రత్నం హీరో. సతీశ్‌వర్మ దర్శకుడు. హీరో రవితేజ నిర్మించారు. ఈ సందర్భంగా గోల్డీ నిసీ విలేకరులతో మాట్లాడారు. ఇది హీరోయిన్‌గా నా తొలిసినిమా. కరప్టడ్‌ కానిస్టేబుల్‌గా చేశాను. నా పాత్రలో హ్యూమర్‌తో పాటు లవ్‌, ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి అన్నారు. ఓ మెకానిక్‌ ఓ కానిస్టేబుల్‌ని ప్రేమలో పడేయడం తెరపై అద్భుతంగా చూపించారు దర్శకుడు. మెకానిక్‌గా కార్తీక్త్న్రం, కానిస్టేబుల్‌గా నేను. మా ఇద్దరి సన్నివేశాల్ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌చేస్తారు అని చెప్పారు. ఇంజనీరింగ్‌ చేసి, నటిని అవ్వాలని కలలు కన్నాను. షార్ట్‌ ఫిలింస్‌లో నటించాను. సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండేదాన్ని. కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలు నాకేం ఎదురుకాలేదుగానీ, కొన్ని ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు మాత్రం బాగా చేశావ్‌ అంటూనే మరి ఏంటి? అంటూ ఏదో అడిగేవాళ్లు. దానికర్థమేంటో తెలిసేదికాదు. అంతకుమించి నేను ఇబ్బందిపడ్డది లేదు. ఏదేమైనా అన్ని రకాల పాత్రలు చేయాలి. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇదే నా టార్గెట్‌ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events