ఉక్రెయిన్ డర్టీ బాంబ్‌ను వాడినట్లు రష్యా ఆరోపిస్తోంది. కీవ్‌లో ఆ బాంబు గురించి గుసగుసలు వినిపిస్తున్నట్లు రష్యా పేర్కొంటోంది. ఈ అంశంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగూ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై సెర్గీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ రెచ్చగొడుతున్నట్లు ఆయన రాజ్‌నాథ్‌కు వెల్లడిరచినట్లు తెలుస్తోంది. డర్టీ బాంబు గురించి రష్యా రక్షణ మంత్రి సెర్గీ నాటో దేవాల రక్షణ మంత్రులతో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమ దేశాలు ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. రేడియోయాక్టివ్ డర్టీ బాంబును వాడేందుకు ఉక్రెయిన్ సిద్దంగా ఉన్నట్లు రష్యా చేస్తున్న ఆరోపణల్ని నాటో దేశాలు ఖండిరచాయి. రష్యానే ఆ బాంబును వాడనున్నట్లు నాటో దేశాలు ప్రత్యారోపణలు చేశాయి.
ఉక్రెయిన్ వార్‌లో ఎవకు కూడా అణ్వాయుధాలను వాడరాదు అని సెర్గీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. న్లూక్లియర్ లేదా రేడియోలాజికల్ వెపన్స్ వాడడం అంటే అది మానవాళికి విరుద్దమే అని రాజ్‌నాథ్ అన్నారు. సంప్రదింపులు, దౌత్యం ద్వారా సమన్యను త్వరగా పరిష్కరించుకోవాలని రష్యా రక్షణ మంత్రికి రాజ్‌నాథ్ సూచించారు. ఉక్రెయిన్ డర్టీ బాంబును వాడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ డర్టీబాంబు వాడితే అది అణ్యాయుద ఉగ్రవాదమే అవుతుందని అని యూఎన్ అభిప్రాయపడిరది.














