ఇజ్రాయెల్ పై హమాస్ దాడులనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చిన్న పిల్లల తలలను తెగ్గోసే చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ ఊహించ లేదన్నారు.దీన్ని అత్యంత పాశవికమైన చర్యగా అభివర్ణించిన ఆయన జీవితంలో అత్యంత ఘోరకలిని చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు పౌరులపై భీకర దాడులు చేసుంతన్న విషయం తెలిసిందే. హమాస్ వందలమంది అమాయక పౌరులను బందీలుగా చేసుకుని వారిని అత్యంత దారుణంగా హతమార్చిందని ఇజ్రాయెల్ రక్షణ దళం(ఇడిఎఫ్) ప్రకటించిన నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ వ్యాఖ్యలపై శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. హమాస్ ఘోరాలకు సంబంధించిన చిత్రాలను బైడెన్ స్వయంగా చూడలేదని తెలిపారు.