Namaste NRI

అఖండ 2 లో కీలక పాత్ర చేశా : సంయుక్త మీనన్‌

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన పానిండియా డివోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అఖండ 2: తాండవం. బ్లాక్‌బాస్టర్‌ అఖండ కు సీక్వెల్‌గా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంయుక్త మీనన్‌ విలేకరులతో ముచ్చటించింది. ఇందులో నా పాత్ర చాలా ముఖ్యమైన సీక్వెన్స్‌లో కీలకంగా ఉంటుంది. ైస్టెలిష్‌గా ఉండే పాత్ర నాది. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభవం. ఈ సినిమా కోసం బోయపాటి అడిగినప్పుడు నిజంగా నా దగ్గర డేట్స్‌ లేవు. ఇలాంటి గొప్ప సినిమాను వదులుకోకూడదని డేట్స్‌ అడ్జెస్ట్‌ చేసుకొని మరీ నటించాను అని అన్నారు.

బోయపాటిది గ్రేట్‌ విజన్‌. అది మన ఇమాజినేషన్‌కి మించి ఉంటుంది. రీసెంట్‌గా కొన్ని సీన్స్‌ చూశాను. నిజంగా షాక్‌ అయ్యాను. అలా ఆయన మాత్రమే తీయగలరు. ఇందులో ఓ సాంగ్‌ చేయాలని, జాజికాయ పాటను వినిపించినప్పుడు నిజంగా నెర్వస్‌ అయ్యాను. అంత మాస్‌ సాంగ్‌ నేనెప్పుడూ చేయలేదు. ఎలాగైనా బాగా చేయాలని రెండు రోజులు ప్రాక్టీస్‌ చేసి ఆ పాట చేశాను అని సంయుక్త గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణది ఫ్రెండ్లీ నేచర్‌ అనీ, ఆయన దర్శకుల హీరో అనీ, లార్డ్‌ శివకు ట్రిబ్యూట్‌లా సినిమా ఉంటుందని సంయుక్త మీనన్‌ తెలిపింది. ప్రస్తుతం తెలుగులో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నానని, కథల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నానని ఆమె పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events