Namaste NRI

బార్బరిక్‌ లాంటి పాత్రలు మరిన్ని చేయాలనుంది :  సత్యరాజ్‌

సత్యరాజ్‌  ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్‌. వశిష్ట ఎన్‌.సింహా, సత్యం రాజేష్‌, ఉదయభాను, క్రాంతి కిరణ్‌, సాంచీ రాయ్‌ ముఖ్య పాత్రధారులు. మోహన్‌ శ్రీవత్స దర్శకుడు. అగ్ర దర్శకుడు మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్‌ పతాకంపై విజయ్‌పాల్‌రెడ్డి అడిసెల నిర్మిస్తున్నారు.  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సత్యరాజ్‌ మాట్లాడారు. ఓ విభిన్నమైన సినిమా త్రిబాణధారి బార్బరిక్‌. ఈ సినిమాకు కథే హీరో. ఇక పాత్రధారులంతా ఎవరికి వాళ్లే మెయిన్‌గా ఫీలవ్వొచ్చు. అలాంటి భిన్నమైన కాన్సెప్ట్‌ ఇది. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. దర్శకుడు, డీవోపీ కలిసి కెమెరా యాంగిల్స్‌తోనే సస్పెన్స్‌ క్రియేట్‌ చేశారు.బార్బరిక్‌ లాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నా. నా మిత్రుడు చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్‌ 22న ఈ చిత్రం విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

ఈ చిత్రంలో నటించినందుకు నటుడు వశిష్ట ఎన్‌.సింహా, నటి ఉదయభాను, సాంచీరాయ్‌ ఆనందం వెలిబుచ్చారు. కమిట్మెంట్‌తో ఈ సినిమా చేశానని, కంటెంట్‌ ఉన్న సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్‌, చైల్డ్‌ ఆర్టిస్టులు కార్తికేయ, మేఘన, డీవోపీ కుశేందర్‌ రమేశ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రాజేష్‌, కొరియోగ్రాఫర్‌ ఈశ్వర్‌ కూడా మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events