తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన పాక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. తన భార్యను ప్రైవేట్ నివాసంలో నిర్బంధించారని, దానిని సబ్‌జైల్‌గా మార్చారని ఆరోపించిన ఖాన్, ఆమెకు ఏమైనా జరిగితే ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాల న్నారు. తన భార్యపై విష ప్రయోగం జరిగిందని, అందుకు ఆధారాలున్నాయని జడ్జికి తెలియచేశారు. కాగా, ఇమ్రాన్ భార్య బుష్రా మాట్లాడుతూ తాను అమెరికన్ ఏజెంట్ అని పుకార్లు పుట్టించారని, తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలిపారని ఆరోపించారు.