ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తమ దేశంలోకి ప్రవేశిస్తే వెంటనే అరెస్టు చేస్తామని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టొఫర్ లక్సన్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు తాము మద్దతిస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ పట్ల తమకు నమ్మకం వుందన్నారు. ఐసిసి ఇటీవల నెతన్యాహ, యోవ్ గాలంట్ లకు అరెస్టు వారంట్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. వారిద్దరు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని విమర్శించింది. గత 13 మాసాలుగా గాజాలో ఇజ్రాయిల్ మారణహోమం సాగిస్తున్నదని, వేలాది మందిని పొట్టనబెట్టుకుందని ఇవన్నీ మానవాళికి వ్యతిరేకంగా చేపట్టే యుద్ధ నేరాల కిందకే వస్తాయని విమర్శించింది. పాలస్తీనియన్ల రక్షణకు పిలుపునిస్తూ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడాలు సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేశాయి.