
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని, దాంతో పాటు మొత్తం 8 యుద్ధాలను ఆపినట్లు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. క్యాపిటల్ హిల్‌లో ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ సమయం లో ఒకవేళ అమెరికా జోక్యం చేసుకోకుంటే, అప్పుడు సుమారు మూడున్నర కోట్ల మంది మరణించేవారని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పినట్లు ట్రంప్ గుర్తు చేశారు.

దేశంలోనే, ఇతర దేశాల్లో ఉన్న అమెరికా పౌరులకు రక్షణ కల్పిస్తున్నామని, దీని పట్ల గర్వపడుతున్నామని, గత పది నెలల్లో 8 యుద్ధాలను ఆపానని, పాకిస్థాన్, భారత్ మధ్య అణ్వాయుధ యుద్ధం జరిగేందని ట్రంప్ తన ప్రసంగంలో వెల్లడించారు. నేను జోక్యం చేసుకోకుంటే 3.5 కోట్ల మంది ప్రజలు చనిపోయేవారని పాక్ ప్రధాని షెహబాజ్ చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. 9వ యుద్ధాన్ని కూడా ఆపేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.














