మణిపూర్ పరిస్థితులపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పందించారు. కోల్కతాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దే విషయంలో భారత్ కోరితే, ఏ రూపంలోనైనా సహకరించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇది భారత్ అంతర్గత విషయం అని పేర్కొంటూనే.. శాంతి లేకుండా ఈశాన్యంలో పురోగతి సాధ్యం కాదన్నారు. అమెరికా స్పందనపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఘాటుగా స్పందించారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయం జీవితంలో, భారత అంతర్గత విషయాల్లో ఒక అమెరికా రాయబారి మాట్లాడటం చూడలేదని అన్నారు.


