Namaste NRI

విలన్‌ ఎవరో కనిపెడితే.. థియేటర్లోనే పదివేలు : సాయిరామ్‌

సాయిరామ్‌ శంకర్‌  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఒక పథకం ప్రకారం. వినోద్‌ కుమార్‌ విజయన్‌ దర్శకుడు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాయిరామ్‌ శంకర్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో నాది లాయర్‌ పాత్ర. అందుకే అందరం లాయర్‌ గెటప్‌లో వచ్చాం. సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అండ్‌ క్రిమినల్‌ లాయర్‌ని. అసలు నేను క్రిమినల్‌ లాయర్‌నా? లేక క్రిమినలా? ఒక నేరంతో లాయర్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్‌ని పంచుతుంది అన్నారు.

ఈ సినిమాకు పట్టుకుంటే పదివేలు పేరుతో ఓ కాంటెస్ట్‌ పెడుతున్నామని, ఇంటర్వెల్‌ లోపు విలన్‌ ఎవరో కనిపెడితే థియేటర్లోనే పదివేలు అందిస్తామని, యాభై కేంద్రాల్లో ఈ కాంటెస్ట్‌ నిర్వహించబోతున్నామని తెలిపారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశమిదని, సాయిరామ్‌శంకర్‌ చాలా కొత్తగా కనిపిస్తాడని దర్శకుడు పేర్కొన్నారు. కథాపరంగా, సాంకేతికంగా ఈ సినిమా గొప్పగా ఉంటుందని నిర్మాత గార్లపాటి రమేష్‌ అన్నారు. శృతిసోధి, అశిమ నర్వాల్‌, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాహుల్‌రాజ్‌, నిర్మాతలు: వినోద్‌ కుమార్‌ విజయన్‌, గార్లపాటి రమేష్‌, కథ, మాటలు, దర్శకత్వం: వినోద్‌ కుమార్‌ విజయన్‌. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

                  

Social Share Spread Message

Latest News