కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌ను భారీ మోజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలు కోరుకుంటున్నారని ఎన్నారై బీఆర్ఎస్ వ్యక్వస్ధాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. వినోద్ కుమార్‌కు మద్దతుగా కరీంనగర్‌లో ఎన్నారై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమకారుడిగా, మేధావిగా గతంలో ఎంపీగా వినోద్‌కుమార్ కరీంనగర్‌కు ఎంతో సేవ చేశారు. వివిధ రంగాల్లో కరీంనగర్ అభివృద్ధి కి వినోద్ కృషి చేశారని, ఇలాంటి నాయకుడు పార్లమెంట్‌కు వెళ్తే యావత్ తెలంగాణ రాష్ట్రానికే మేలు జరుగుతుందన్నారు. ప్రజలు భారీ మెజారిటీతో వినోద్ కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కరీంనగర్ గడ్డ కేసీఆర్ అడ్డా అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి కీలక సందర్భంలో కేసీఆర్‌కు అండగా కరీంనగర్ నిలిచింద న్నారు.
బండి సంజయ్ గత ఐదు సంవత్సరాలుగా కరీంనగర్‌కు పైసా పని చెయ్యలేదని వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్‌లో ఎక్కడా పోటీలో లేదని, దాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ టౌన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, ఎన్నారై బీఆర్‌ఎస్ నాయకులు రాజ్ కుమార్ శానబోయి, ప్రశాంత్ మామిడాల, వివేక్, ప్రవీణ్ పంతులు పాల్గొన్నారు.