అనుపమ పరమేశ్వరన్ కథా నాయికగా, దర్శన రాజేంద్రన్, సం గీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పరదా. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజరు డొంకడ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ ఈ సినిమా స్టోరీ లైన్ నాకు తెలుసు. చాలా అద్భుతమైన కథ. బాలీవుడ్‌లో లాపతలేడీస్ లాంటి సినిమాలు చూస్తుంటాం. మనం ఎందుకు అలాంటి సినిమాలు చేయలేమని ఆలోచిస్తుంటాం. ఇలాంటి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల్ని తప్పకుండా ప్రోత్సహించాలి. ఇలాంటి సినిమాలు విజయాలు సాధిస్తే, నిర్మాతలకి ధైర్యం వస్తుంది. ప్రవీణ్ తీసిన సినిమా బండి నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో అతను మరో అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను. గోపీసుందర్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. అనుపమ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఏ క్యారెక్టర్ ఇచ్చిన 100% ఎఫర్ట్ పెడుతుంది. తనకి సినిమా అంటే చాలా ప్యాషన్. ఈ సినిమాలో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మెగాస్టార్ బర్త్‌డే కానుకగా ఈనెల 22న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి అని అన్నారు.

హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ పరమేశ్వరన్ ఈ సినిమా నాకు ఎంత ఇంపార్టెంటో రామ్‌కి బాగా తెలుసు. నాకు సపోర్ట్‌గా నిలిచి, ఈ వేడుకకు వచ్చారు. ఇదొక మంచి సినిమా. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే ఆలోచించేలా చేస్తుంది అని చెప్పారు. డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ అందరికి నమస్కారం. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ గారికి థాంక్యూ సో మచ్. మాకు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు. ప్రాణం పెట్టి సినిమా చేసాం. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి అన్నారు.















