అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలాస్కాలో జరగనున్న చర్చలు విఫలమైతే భారత్‌పై అదనంగా మరోసారి అమెరికా ప్రభుత్వం సుంకాలు విధిస్తుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ట్రంప్, పుతిన్ మధ్య అలాస్కాలో జరగనున్న చర్చలు అనుకూల ఫలితాలు సాధించడంలో విఫలమైన పక్షంలో భారత్‌పై అదనపు సుంకాలు వడ్డించక తప్పదని ఆయన అన్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనంగా సుంకాలు విధించామని, పరిస్థితి తమకు అనుకూలంగా లేకపోతే భారత్‌పై మరోసారి అదనపు సుంకాలు విధించడమో లేదా ఆంక్షలు విధించడమో తమ ప్రభుత్వం చేపడుతుందని స్కాట్ హెచ్చరించారు.
















