Namaste NRI

భవిష్యత్తులో ఆ అవకాశం వస్తే అస్సలు వదులుకోను :జాన్వీకపూర్‌

అందాల భామ జాన్వీకపూర్‌ నటించిన  తాజా చిత్రం బవాల్‌ ఓటీటీలో విడుదలైంది. చరిత్ర, వర్తమాన అంశాలను కలబోసి దర్శకుడు నితీష్‌ తివారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నటిగా ఈ సినిమా తనను ఓ మెట్టు ఎక్కించిందని జాన్వీకపూర్‌ ఆనందం వ్యక్తం చేసింది. చరిత్ర ప్రస్తావన ఉన్న సినిమాల్లో నటించడం గొప్ప అనుభవమని చెప్పింది. ఈ సందర్భంగా  జాన్వీకపూర్‌ మాట్లాడుతూ చరిత్ర అధ్యయనాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని, కాలేజీ రోజుల్లో హిస్టరీ తన ఫేవరేట్‌ సబ్జెక్ట్‌ అని చెప్పింది.  చరిత్రకు సంబంధించిన వ్యాస రచన పోటీల్లో నాకు బహుమతులు లభించేవి. మిగతా సబ్జెక్ట్స్‌లో నేను సాధారణ స్టూడెంట్‌నే కానీ హిస్టరీలో మాత్రం నాతో ఎవరూ పోటీపడలేక పోయేవారు. ప్రపంచ చరిత్రపై నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. బవాల్‌ చిత్రంలో రెండో ప్రపంచ యుద్ధ ప్రస్తావన ఉంటుంది. ఈ సినిమా కోసం ఏ మ్యాన్స్‌ సెర్చ్‌ ఫర్‌ మీనింగ్‌ అనే పుస్తకాన్ని చదివాను. నాజీల కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో యూదులు అనుభవించిన కష్టాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నా. బవాల్‌ సినిమా విషయంలో ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది. భవిష్యత్తులో చారిత్రక కథాంశాల్లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events