తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితి ఇంకా సంక్లిప్టంగానే ఉంది.ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశ ప్రతిపక్ష సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పార్టీ ఎంపీ హర్ష డి సిల్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టాల నుంచి బయటపడే మార్గం లేక అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. 1991లో భారతదేశం ఎదర్కొన్న ఆర్థిక సంక్షోభవంలానే ప్రస్తుతం తమ దేశ పరిస్థితి ఉందన్నారు. దేశం మళ్లీ కోలుకుంటుందని, అయితే అందుకు రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పార్టీలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండబోదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు ప్లాట్‌ఫాం రూపొందించాలని కోరారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి జఠిలంగా ఉందని, మరింత విపత్తులోకి జారిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)