నటి రమ్యకృష్ణ తెలుగు సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బాహుబలి సినిమాలో తల్లిగా నటించి అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగారు. తల్లి క్యారెక్టర్‌లో ఎవరు బాగా చేస్తారు అంటే ఠక్కుమని గుర్తు వచ్చేలా బాహుబలితో పాటు లైగర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ పాత్రలో నటించాలంటే మహిళ నటులలో ఆమె ముందు వరసలో ఉంటారు. రమ్యకృష్ణ ఒక ఇంటర్వూ లో సంచలన కామెంట్స్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ను ఎదగాలంటే దర్శక నిర్మాలతో పాటు హీరోల కోరికలు తీర్చాలని తెలిపారు. వారి పడకగదిలోకి వెళ్లాల్సిందేనని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్టార్ హీరోయిన్ కావాలంటే మాత్ర ఎక్కడో ఒక దగ్గర లొంగిపోవాల్సి వస్తుందని కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పారు. దర్శక నిర్మాతలు, హీరోల కోరికలు తీర్చక పోతే మాత్రం కెరీర్ అక్కడితో ఆగిపోతుందని రమ్యకృష్ణ వివరించారు.