Namaste NRI

ఆకట్టుకుంటున్న ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి టీజర్

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. తాజాగా చిత్ర  టీజర్‌ను  విడుదల చేశారు. ఈ సందర్భంగా  దర్శకుడు మాట్లాడుతూ ఈ కథ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. నిజజీవితంలో వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సహజ సంభాషణలు ఉంటాయి. మనచుట్టూ ఉండే మనుషుల కథ ఇది అని తెలిపారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ చెప్పారు. నాగశౌర్య మాట్లాడుతూ అవసరాల శ్రీనివాస్‌తో  నాకిది మూడో చిత్రం. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద తరహాలో ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా  గుర్తుండిపోతుంది. ఇలాంటి కథ మళ్లీ రాదనుకుంటున్నా.కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాక ఆనందం కలుగుతుంది. కానీ ఈ సినిమా విషయంలో విడుదలకు ముందే ఆనందంగా ఉన్నా. తప్పకుండా అందరిని మెప్పించే చిత్రమవుతుంది అన్నారు. కథానాయిక మాళవిక మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ తమ ప్రేమకథతో పోల్చుకునే సినిమా ఇదని పేర్కొంది. ఈ చిత్రాన్ని మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  రచయితలు భాస్కరభట్ల, లక్ష్మిభూపాల, డీవోపీ సునీల్ కుమార్ నామ, ఎడిటర్ కిరణ్ గంటి, నటీనటులు అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, అర్జున్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News