
ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ హోం టౌన్. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రధారులు. శ్రీకాంత్‌రెడ్డి పల్లే దర్శకుడు. వచ్చే నెల 4 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేశారు. ఇంకా ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రాని 2000 సంవత్సరంలో ఓ అందమైన గ్రామం నేపథ్యంగా ఈ సిరీస్ కథ సాగుతుందని టీజర్ చెబుతున్నది. ఇంటర్నెట్ మొదలైన కొత్తలో సోషల్ మీడియా అంటే తెలియని ముగ్గురు విద్యార్థులు చేసే ఫన్ నవ్విస్తుందని, స్కూల్ లైఫ్‌లో విద్యార్థులు చేసే సరదా పనులు, అప్పుడే మొదలైన ప్రేమలు, వంటి అంశాలతో అందరికీ రిలేట్ అయ్యేలా ఈ హోం టౌన్ అంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సిరీస్‌కి కెమెరా: దేవ్ దీప్ గాంధీ కుండు, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాతలు: నవీన్ మేడారం, శేఖర్ మేడారం.
