సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటిస్తున్న సినిమా జైత్ర. ఈ చిత్రాన్ని అల్లం శ్రీ తన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ పతాకంపై అల్లం సుభాష్ నిర్మిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకుడు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు తోట మల్లికార్జున మాట్లాడుతూ మట్టితో అనుబంధం పెంచుకున్న రైతు కథ ఇది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాం. సహజత్వంతో సినిమా సాగుతుంది అన్నారు. నిర్మాత అల్లం సుభాష్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ట్రైలర్ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. జైత్ర సినిమా ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో రాబోతోందని తెలిపారు. హీరో సన్నీ నవీన్ మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యం అంటే ఫ్యాక్షన్ కథలు అనుకుంటారు గానీ అందుకు భిన్నంగా ఓ రైతు కథను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. టీజర్, పాటలకు దక్కిన ఆదరణ సినిమాకూ వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. ఈ నెల 26న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-126.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-119.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-120.jpg)