సునామీ కిట్టి హీరోగా నటిస్తున్న చిత్రం కోర. ఒరాటశ్రీ దర్శకుడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఛరిష్మా కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను అగ్ర నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. లవ్, యాక్షన్ జోనర్‌లో వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, పాన్ ఇండియా సినిమాగా అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: బీఆర్ హేమంత్ కుమార్, నిర్మాతలు: డా॥ ఏబీ నందిని, ఏఎన్ బాలాజీ, పి.మూర్తి, రచన-దర్శకత్వం: ఒరాటశ్రీ.