Namaste NRI

బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ అధ్వర్యంలో .. ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు   

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు  బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఎన్నారై బీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన అండాలస్  గార్డెన్‌ లో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా అమరవీరులను  స్మరించుకొని కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్  మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కేసీఆర్ రాజీలేని పోరాటం, అమరవీరుల త్యాగాలతో రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు.

స్వరాష్ట్రం సిద్ధించాక పదేండ్లలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చేరిపేయడమేనని పేర్కొన్నారు. అలంటి ఆలోచనను కాంగ్రెస్ ప్రేభుత్వం విరమించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేష్  బొలిశెట్టి ప్రధాన కార్యదర్శి  పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు, చెన్నమనేని రాజేందర్, సంగెపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, బొలిశెట్టి ప్రమోద్, అరవింద్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News