
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల ప్రభావం విమాన చార్జీలపైనా పడింది. ఈ కారణంగా ఈ వేసవిలో భారత్-అమెరికా ప్రయాణ చార్జీలు 10-15 శాతం తగ్గాయి. ఈ నెల 19న అందుబాటులో ఉన్న మే నెల మధ్యలో షెడ్యూల్ కలిగిన ముంబై-న్యూయార్క్ విమాన టికెట్ ధర తక్కువగా రూ.37 వేలు ఉంది. తిరుగు ప్రయాణం టికెట్ ధర రూ.76 వేలుగా ఉంది. అమెరికాకు అత్యధికంగా వలస వెళ్లిన వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలుస్తారు. అయితే ట్రంప్ విధానాల కారణంగా నిరుడుతో పోలిస్తే ఆ దేశానికి వెళ్లే భారత ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. నిరుడుతో పోలిస్తే విమాన టికెట్ ధరలు సుమారుగా 5-8 శాతం తగ్గాయని థామస్ కుక్ (ఇండియా) ప్రెసిడెంట్ రస్తోగీ తెలిపారు.
