Namaste NRI

ఈ సినిమాలో బేబీ దే కీరోల్: సంజయ్ రావు

సంజయ్‌ రావు కథానాయకుడిగా  నటిస్తున్న తాజా చిత్రం స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ . ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వంలో అప్పిరెడ్డి, అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సంజయ్‌రావు మీడియాతో మాట్లాడుతూ స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ కథను దర్శకుడు చెబుతూనే తెగ నవ్వుకున్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అన్నారు.   ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడికి జాతకంలో దోషం వుండటం వల్ల దాని పరిహారం కోసం కుక్కని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత ఆ యువకుడికి ఎదురైన పరిణామాలేంటి అనేది ఈ చిత్ర కథ. ప్రతి సన్నివేశం ఎంతో వినోదాత్మకంగా వుంటుంది. ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్‌. అదే సినిమాను మొత్తం డిసైడ్‌ చేస్తుంది. ఈ చిత్రంలో చాలా మంది డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ వుంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి వుండవు. జనరల్‌గా రాత్రి పూట బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌ మాట్లాడుకునేదే వుంటుంది. అదే రియాలిటీ వుంటుంది. ఈ రియాలిటీకి యంగ్‌ జనరేషన్‌ కనెక్ట్‌ అవుతుంది అన్నారు.

Social Share Spread Message

Latest News