చైనా కంపెనీలపై భారత్ కొరఢా ఝుళిపిస్తున్నది. 2020లో మొదలైన చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్ నాణ్యత లేని పవర్ బ్యాంకులు విక్రయిస్తున్న రెండు చైనా కంపెనీలపై చర్యలు చేపట్టింది. లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్న రెండు ప్రధాన కంపెనీలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టగా, మూడో కంపెనీపై విచారణ జరుపుతున్నది. చైనా నుంచి దిగుమతి అవుతున్న నాసిరకం పవర్ బ్యాంక్‌ల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది.

చైనా నుంచి దిగుమతి చేసుకున్న అనేక పవర్ బ్యాంకులు కంపెనీ క్లెయిమ్ చేసిన సామర్థ్యంలో కేవలం 50-60శాతంతో మాత్రమే పని చేస్తున్నాయి. భారతీయ కంపెనీలు ఈ తక్కువ నాణ్యత బ్యాటరీలను చౌక ధరలకు కొనుగోలు చేసి, మార్కెట్లు ఉత్పత్తులను చౌకగా విక్రయిస్తున్నాయి. ఈ చర్య మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని ప్రభావితం చేయడంతో పాటు భద్రత, పనితీరు విషయంలో కస్టమర్స్‌ని తప్పుదారి పట్టిస్తున్నది.
