లద్ధాఖ్ నుంచి ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని రెండు కొత్త కౌంటీలుగా ఏర్పాటు చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై భారత్ నిరసన తెలిపింది. ఈ విషయమై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ చైనా రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటనను చూశాం. ఈ కౌంటీల్లో కొన్ని భాగాలు లద్ధాఖ్‌లో ఉన్నా యి. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా తీరును ఎన్న డూ అంగీకరించలేదు. భారతదేశ సార్వభౌమాధికారంపై మా దీర్ఘకాలిక, స్థిరమైన వైఖరిపై కొత్త కౌంటీల ఏర్పాటు నిర్ణయం ప్రభావం చూపించదు అని పేర్కొన్నారు.