Namaste NRI

చైనాను దాట‌నున్న భార‌త్

 ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాభా క‌లిగిన దేశంగా చైనాను భార‌త్ ఈ నెల చివ‌ర వ‌ర‌కు దాటేస్తుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్ల‌డించింది. ఈ నెల చివ‌రి నాటికి ఇండియా జ‌నాభా 1.425 బిలియ‌న్లు అవుతుంద‌ని యునైటెడ్ నేష‌న్స్ పేర్కొన్న‌ది. అయితే 2064 నాటికి భార‌తీయ జ‌నాభా ఓ స్థిర‌త్వానికి వ‌స్తుంద‌ని, ఇక ఈ శ‌తాబ్ధం చివ‌రినాటికి భార‌త్ జ‌నాభా 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల వ‌ద్ద నిలిచిపోతుంద‌ని యూఎన్ అధికారి వెల్ల‌డించారు. ఏప్రిల్ చివ‌రి నాటికి చైనాను ఇండియా దాటేస్తుంద‌ని, 2022లో చైనా జ‌నాభా 1.4 బిలియ‌న్‌కు చేరుకుంద‌ని, ఆ త‌ర్వాత త‌గ్గుద‌ల ప్రారంభ‌మైన‌ట్లు యూఎన్ పాపులేష‌న్ డివిజ‌న్ డైరెక్ట‌ర్ జాన్స్ విల్‌మోత్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events