Namaste NRI

ఎఫ్‌-1 వీసాల రద్దుపై… భారత్‌, చైనా విద్యార్థులు న్యాయ పోరాటం

ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలను చిన్న చిన్న కారణాలను చూపుతూ అమెరికా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ముగ్గురు భారతీయ విద్యార్థులు, ఇద్దరు చైనా విద్యార్థులు సవాల్‌ చేశారు. వీరు న్యూ హాంప్‌షైర్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు. తమ ఎఫ్‌-1 స్టేటస్‌ను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా రద్దు చేయడం వల్ల చట్టబద్ధమైన స్టూడెంట్‌ స్టేటస్‌కు తాము దూరమయ్యామని వాదించారు. తమ వీసాలను పునరుద్ధరించాలని, తమను నిర్బంధించడాన్ని, అమెరికా నుంచి పంపించేయడాన్ని ఆపాలని కోరారు. వందలాది మంది విదేశీ విద్యార్థుల ఎఫ్‌-1 వీసాలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ ఏకపక్షంగా రద్దు చేసిందని తెలిపారు.

అదేవిధంగా ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పార్టిసిపెంట్స్‌ ఎఫ్‌-1 వీసాలను కూడా రద్దు చేసిందన్నారు. భారతీయ విద్యార్థులు మణికంఠ పసుల, లింఖిత్‌ బాబు గొర్రెల, తనూజ్‌ కుమార్‌ గుమ్మడవెల్లి, చైనా విద్యార్థులు హాంగ్రుయి ఝాంగ్‌, హాయాంగ్‌ ఆన్‌ ఈ దావాను దాఖలు చేశారు. లింఖిత్‌ బాబు గ్రాడ్యుయేషన్‌ వచ్చే నెలలో పూర్తవుతుంది. గుమ్మడవెల్లి, పసుల మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి కావడానికి ఒక సెమిస్టర్‌ మిగిలి ఉంది. కోర్టు జోక్యం చేసుకోకపోతే వీరి ఆశలు అడియాశలు అవుతాయి.

Social Share Spread Message

Latest News