Skip to main content

Namaste NRI

భారత బిలియనీర్‌కు జైలు శిక్ష

మనీలాండరింగ్ కేసులో దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయ బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నికి అక్కడి కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. షెల్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా మిలియన్ దిర్హామ్‌లను లాండరింగ్, అనుమానస్పద లావాదేవీలకు పాల్పడినందకు బల్వీందర్‌కు ఈ శిక్షపడింది. అంతేకాక,  ఈ ప్రముఖ వ్యాపారవేత్తకు 5లక్షల ఎఇడి (రూ.1.14 కోట్లు)తో పాటు 150 మిలియన్ ఎఇడి (రూ.344 కోట్లు) జరిమానా విధించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తర్వాత దేశం వదిలి పోవాలని కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు, అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.

Social Share Spread Message

Latest News