
అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న భారతీయుడు అరెస్టయ్యాడు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతికి అతడు కారణమయ్యాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జషన్ సింగ్ 2022లో అమెరికాలోకి ప్రవేశించాడు. అప్పుడు కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ పెండింగ్‌లో ఉండటంతో అతడిని విడుదల చేశారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా ధ్రువీకరించింది. కాలిఫోర్నియా ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సింగ్‌కు కూడా గాయాలయ్యాయి. ట్రక్ నడుపుతున్న సమయంలో అతడు డ్రగ్స్ మత్తులో ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. అతడు ట్రాఫిక్‌లో కూడా బ్రేక్స్ వేయలేదని ట్రక్ డ్యాష్‌క్యామ్ రికార్డింగ్‌ను బట్టి తెలుస్తోందని హైవే పెట్రోలింగ్ అధికారి వెల్లడించారు.
















